అక్రమ మట్టితోలకాల ప్రదేశాన్ని పరిశీలించిన మైనింగ్ అధికారులు

- Advertisement -

అక్రమ మట్టితోలకాల ప్రదేశాన్ని పరిశీలించిన మైనింగ్ అధికారులు

Mining officials inspected the site of the illegal earthworks

రుద్రవరం,
మండల పరిధిలోని టి లింగందిన్నె పొలిమేరలో ఉన్న తిప్పపై అక్రమంగా మట్టి తోలకాలు జరిపే ప్రదేశాన్ని మైనింగ్ అధికారులు శనివారం పరిశీలించినట్లు తెలిసింది. కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా రెవిన్యూ తిప్పనుండి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని మట్టి అక్రమ రవాణాను నియంత్రించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. స్పందించిన జిల్లా కలెక్టర్ తిప్పను పరిశీలించి అక్రమ మట్టి రవాణా కొనసాగుతున్నట్లయితే వెంటనే నియంత్రించాలని ఆదేశించినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు మట్టి అక్రమ రవాణా కొనసాగుతున్న తిప్ప వద్దకు వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్టు తెలిసింది. అనంతరం రుద్రవరం లోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ను కలిసిన మైనింగ్ అధికారులు అక్రమ మట్టి రవాణా నియంత్రణపై చర్చించినట్లు తెలిసింది.  ఇప్పటికైనా మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా జరుపుతున్న అక్రమ మట్టి తవ్వకాలను అరికట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల పైన ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా జరుపుతున్న అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular