- Advertisement -
దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు-హజరయిన కేంద్ర మంత్రి
Free tools for the disabled- Union Minister presentకాకినాడ,
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దివ్యాంగులు సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆర్థిక సాధికారతకు కృషి చేయడం జరుగుతుందని కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ మంత్రి బన్వారీ లాల్ వర్మ (బిఎల్.వర్మ) పేర్కొన్నారు.
సామాజిక్ అధికారిత శివిర్ కార్యక్రమంలో భాగంగా అలింకో సహకారంతో జిల్లాలోని దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం శనివారం కాకినాడ పట్టణం సురేష్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా కేంద్ర మంత్రి బిఎల్.వర్మ, కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వర్చువల్ గా పాల్గొన్నారు. అదేవిధంగా శాసనమండలి సభ్యులు కర్రి పద్మ శ్రీ, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, జిల్లా పరిషత్ సీఈవో వీవీవీఎస్.లక్ష్మణ రావు, అలింకో ప్రతినిధులు డీజీఎం సంజయ్ సింగ్, ఆఫిసర్ రవిశంకర్ ముఖ్య అతిథులుగా హాజరై కాకినాడ పట్టణం, రూరల్ నియోజకవర్గాల్లో అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా వివిధ రకాల ఉపకారణాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దివ్యాంగులను ఉద్దేశించి కేంద్రమంత్రి బిఎల్ వర్మ మాట్లాడుతూ సబ్ కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఆర్థిక సాధికారత దిశగా అడుగులు వేసేందుకు ఒక సుగమమైన సహృద్భావ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు అందిస్తుందన్నారు. దివ్యాంగుల సర్వతోముఖాభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగుల వర్గాలను ఏడు నుంచి 21 వరకు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు దివ్యాంగులకు మూడు శాతంగా ఉన్న రిజర్వేషన్ ని నాలుగు శాతానికి పెంచడం జరిగిందన్నారు. అదేవిధంగా ఉన్నత విద్య అభ్యసించే దివ్యాంగులకు రిజర్వేషన్ శాతాన్ని మూడు నుంచి ఐదు శాతానికి పెంచడం జరిగిందని కేంద్ర మంత్రి వివరించారు. దివ్యాంగులకు ఒక సుగమ్య వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సుగమ్యం భారత్ అభియాన్ ను శుభారంభం చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుగమ్య భారత్ అభియాన్ కింద 38 భవనాలు నిర్మాణానికై రూ.14.36 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. విద్యా సాధికారత దిశగా దేశంలో ఛత్ర వృత్తి యోజన ద్వారా 2.68 లక్షల దివ్యాంగుల విద్యార్థులకు రూ.874.96 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,934 దివ్యాంగులకు రూ.45.04 కోట్లు స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. డీడీఆర్సీ యువజన కింద 419 జిల్లాల దివ్యాంగుల పునరావస కేంద్రాలకు రూ.50.39 కోట్ల మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
- Advertisement -




