- Advertisement -
ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటాం
Strict action will be taken against sand irregularitiesపల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు వెల్లడి
నరసరావుపేట,
పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 6029 నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.ఇసుక అక్రమాలు అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇసుక కొరత పుకార్లు నమ్మవద్దని తెలిపారు. జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా అక్రమాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు
- Advertisement -




