Saturday, April 25, 2026

జగన్ పై బుద్దా వెంకన్న ఫైర్

- Advertisement -

జగన్ పై బుద్దా వెంకన్న ఫైర్

Buddha Venkanna fire on Jagan

విజయవాడ
వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శం. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని గొప్పగా చెప్పారు. ఇటువంటి వాటిని చూసి వైసిపి నేతలు భరించ లేక పోతున్నారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలి. అబద్దాలు ప్రచారం చేసే అడ్రెస్ లేకుండా పోయారు. మళ్లీ చేస్తే…వైసిపి భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు. దమ్ముంటే  వరదల్లో అవినితి జరిగిందని బహిరంగ చర్చకు రావాలి. అవినీతి కి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్
ఏనాడైనా బురదలో అడుగు పెట్టి ప్రజలను కలిశావా. నువ్వా పేద ప్రజల కోసం మాట్లాడేది. వరద ప్రజలకు నువ్వెంత సహాయం చేశావు. కోటి రూపాయలు ప్రకటించిన జగన్ ఎవరికి ఖర్చు పెట్టారు. సిగ్గు శరం లేకుండా అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తావా అని ప్రశ్నించారు. విపత్తు ఎప్పుడు వచ్చినా నేనున్నా అని ప్రజలతో ఉండే సిఎం చంద్రబాబు. ప్రజా దనామ్మి దోచుకున్న జగన్ కూడా నీతులు వల్లిస్తున్నాడు. అబద్దాలు చెప్పడానికి కూడా అర్ధం లేదా మీకు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనే మీ కుట్ర లను తిప్పి కొడతాం. జగన్ నీకు సిగ్గుంటే ఇప్పుడు అయినా మనసు మార్చుకో. 151 స్థానాల నుంచి 11స్థానాలకు ప్రజలు నిన్ను పరిమితం చేశారు. ఇలాంటి కుట్ర లు చేస్తే ఒక్క స్థానం కూడా ఉండదు. పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ప్రజలే తరిమి కొడతారు. జగన్ ప్రజలకు సేవ  చేయడం అలవాటు  చేసుకో. కుట్ర, కుళ్లు రాజకీయాలు మానుకో జగన్ అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్