పెరుగుతున్న సైబర్ నేరాలు

- Advertisement -

పెరుగుతున్న సైబర్ నేరాలు

Cyber ​​crime on the rise

ఏలూరు
రాష్ట్రంలో  సైబర్ నేరాల సంఖ్యపెరిగిపోతోందని, వాటి నుండి రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం వార్షిక తనిఖీలలో భాగంగా కృష్ణాజిల్లా నాగాయలంక పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ గంగాధరరావు తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా నాగాయలంక పోలీసు సిబ్బంది నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు దాదాపు 6 గంటల పాటు నిర్వహించిన ఈ తనిఖీలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నాగాయలంక స్టేషన్ పరిధిలో ఒక ఒక వృద్ధురాలి హత్య కేసు మాత్రమే పెండింగ్ లో ఉందని అన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ డిఎస్పీ మురళీధర్, అవనిగడ్డ సిఐ యువకుమార్, చల్లపల్లి సిఐ ఈశ్వరరావు, నాగాయలంక ఎస్ ఐ రాజేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular