- Advertisement -
మద్దులపల్లి మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం
Maddulapalli Market Committee's ruling class takes oathపాల్గోన్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
ఖమ్మం
వ్యవసాయ మార్కెట్కు విక్రయానికి వచ్చే రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, మంచి సేవలు అందించేవిధంగా నూతన పాలకవర్గం పని చేయాలని రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్, పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు హాజరయ్యారు.చైర్మన్ గా బైరు హరినాథ్ బాబు మరియు ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ నూతన వ్యవసాయ కమిటీకి శుభాకాంక్షలు తెలియచేశారు. రాబోయే మూడు నెలల్లోనే ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణం పూర్తి చేసి, సంక్రాంతికి ప్రారంభం చేస్తామని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో 4 గ్యారెంటీ లు పూర్తి చేశామని, రైతులకి రుణ మాఫీ కూడా చేశామని, మిగిలిన రైతులకి కూడ రైతు రుణ మాఫీ చేస్తామని అన్నారు.రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుగా మాట్లాడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం లక్ష రుణ మాఫీ చేయడానికి 10 సంవత్సరాలు పట్టిందని అన్నారు.రాష్ట్రం మొత్తంలో ప్రతి నియోజక వర్గంలో ఇంటిగ్రీడెడ్ స్కూల్ ప్రారంభించబోతున్నామని అన్నారు.రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి నియోజక వర్గానికి 3,500 ఇళ్లు కూడా ఇవ్వబోతుందని, ప్రతి ఇంటికి ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుందని అన్నారు. ఆనాటి ప్రభుత్వం వారి పదవుల మీద ఉన్న ఆశ ప్రజల మీద లేదని అన్నారు. బావ బామ్మర్దులు ఇద్దరు వారి ఇళ్లు పోతాయని హైదరాబాద్ లో మూసినది వద్ద దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు. రైతుల కోసం 2024 చట్టం ద్వారా ధరణి సరి చేసి పట్టాలు రాని రైతులకి పట్టాదారు పాస్ బుక్కులు ఇస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ మేలు చేస్తుందని అన్నారు.
అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలేరు నియోజక వర్గానికి గతంలో బై ఎలెక్షన్ లో గెలిచి మూడు సంవత్సరాలలో అభివృద్ధి చేశానన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా శక్తి మేర కృషి చేసి మార్కెట్ అభివృద్ధి చేస్తామని అన్నారు. గోదావరి జలాలను పాలేరులో కలిపి నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. నా చిరకాల మిత్రుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పాలేరు నియోజక వర్గం అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే పంట నుండి సన్న వడ్లకి 500 రూ బోనస్ అధికంగా ఇస్తామని అన్నారు.పంటలకు ఇన్స్యూరెన్స్ చేయిస్తామని, పామాయిల్ సాగు చేస్తే, ఇక్కడే ప్యాక్టేరి పెట్టిస్తామని అన్నారు. ఈ నియోజక వర్గం పచ్చని పొలాలు, ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకుంటన్ననన్నారు. రైతు రుణ మాఫీ చేశామని, రైతులు తల దించుకునే పరిస్థితి రానివ్వమని అన్నారు. ఖమ్మం మార్కెట్ తల దాన్నెలా మధ్ధులపల్లి మార్కెట్ ని అభివృద్ధి చేస్తామన్నారు. పనికి రాని నియోజక వర్గంగావున్న పాలేరు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశామని ఇంకా అభివృద్ధి చేస్తామని అన్నారు.
- Advertisement -




