- Advertisement -
యువత రతన్ టాటా ను ఆదర్శంగా తీసుకోవాలి
Youth should take Ratan Tata as an exampleటిడిపి సీనియర్ నాయకులు మంచూరు సూర్యనారాయణ రెడ్డి
బద్వేలు,
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి పట్ల బద్వేల్ నియోజవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.యువత రతన్ టాటా ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.
రతన్ టాటా వ్యాపార రంగంలో రాణించి గొప్ప పేరు పొందిన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారని ప్రస్తుత సమాజంలో యువత రతన్ టాటా ను ఆదర్శంగా తీసుకుని వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో విలువలతో కూడిన వ్యాపారాలు చేస్తూ, వ్యాపారం అంటే కేవలం ఆదాయం మాత్రమే కాదని అభిమానం, ఆత్మీయత పొందిన వ్యక్తి ఆయన అని రతన్ టాటాకు దేశ విదేశాలలో ఒక గుర్తింపు ఉందని నేడు ఆయన మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందన్నారు. రతన్ టాటా మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నానని బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -




