- Advertisement -
టోల్ ప్లాజాలలో బారులు తీరిన వాహనాలు
Vehicles lined up at toll plazasనల్గోండ
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని హైదారాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. దసరా పండుగ కోసం సొంత ఊర్లకు వెళ్లిన వారంతా.. తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమవుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి హైదారాబాద్ వైపు వెళ్లే వాహనాల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఉమ్మడి నల్లగొండ పరిధిలో..ఎన్హెచ్ 65 మీద ఉన్న ఉన్న కేతేపల్లి మండలలోని “కొర్లపహాడ్” టోల్ ప్లాజా.. చౌటుప్పల్ మండలంలోని “పంతంగి” టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ కొనసాగుతుంది. దీంతో.. రెండు టోల్ ప్లాజాల దగ్గర కిలో మీటరు మేర వాహనాలు బారులు తీరాయి. మరో వైపు.. హైదారాబాద్ – వరంగల్ హైవే పైనున్న బీబీనగర్ టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ బాగా పెరిగింది. నార్కట్ పల్లి- అద్దంకి హైవేపై ఉన్న మాడుగులపల్లి టోల్ గేట్ దగ్గర సైతం.. ట్రాఫిక్ పెరగడంతో.. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
- Advertisement -




