మాచర్ల యూనివర్సల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

- Advertisement -

మాచర్ల యూనివర్సల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

The services of Macherla Universal Foundation are appreciated

పదో తరగతి,ఇంటర్,మెరిట్ విద్యార్థులకు అవార్డులు అందచేత
ముఖ్యఅతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి
మాచర్ల,
పల్నాడు జిల్లా మాచర్ల యూనివర్సల్ ఫౌండేషన్ అధినేత ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల వీరాంజనేయులు ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ మెరిట్ విద్యార్థులకు అవార్డుల కార్యక్రమం సోమవారం మాచర్ల లోని కోదండరామ దేవాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిప్యూటీ డీఈవో గాదె రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, మాచర్లలో వైద్య విద్య అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మెరిట్ విద్యార్థులను గుర్తించి వారికి ప్రతిభ పురస్కారాలు అందజేసిన యూనివర్సల్ ఫౌండేషన్ చైర్మన్ ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల వీరాంజనేయులు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ కూని శెట్టి వెంకటేశ్వర్లు, డాక్టర్ రామకోటయ్య, టిడిపి నాయకులు వై కేశవరెడ్డి, దుర్గారావు, పల్నాడు జూనియర్ కళాశాల అధ్యాపకులు శివప్రసాద్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular