ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకులా ఉంటా – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

- Advertisement -

ప్రతి కుటుంబంలో పెద్ద కొడుకులా ఉంటా – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

I will be like an elder son in every family - MLA Bolishetti Srinivas

తాడేపల్లిగూడెం,అక్టోబర్ 17.
నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కష్టసుఖాలలో పెద్ద కొడుకుగా ఉంటానని ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల పాలనలో పల్లెటూర్లను పూర్తిగా విస్మరించి అభివృద్ధిలో వెనుకబడిపోయేలా చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. తమ పుట్టిన ఊరికి సేవ చేద్దామని కలలుగని ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పంచాయతీలో నిధులు దారి మళ్ళీ పోవడం ద్వారా ఏమి చేయలేని స్థితిలో ఉత్సవ విగ్రహాలు లా మిగిలిపోయారన్నారు. ఇది మంచి ప్రభుత్వం, పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పల్లెటూర్లకు కనీస అవసరాలు కల్పించడానికి మూడు సంవత్సరాల ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని రానున్న మూడేళ్లలో త్రాగునీరు, రోడ్లు, డ్రైన్లు దళిత అవసరాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పల్లెటూర్ల అభివృద్ధిలో ప్రజాభాగ్యస్వామ్యాన్ని కూడా కోరుతున్నానని మీ ఊరు అభివృద్ధిలో మీ వంతుగా మీరు సాయం చేస్తే తన వంతుగా తాను సాయమందిస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు చేరుతుండడంతో పంచాయతీల అభివృద్ధికి మార్గం సుఖం అయిందన్నారు. ఐదేళ్ల కాలంలో గోతులు కూడా పూడ్చలేని నాయకులు మళ్ళీ జెండాలతో సిగ్గు లేకుండా సిద్ధమవుతున్నారని వారికి ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పిన వారి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని అభివృద్ధి చేసే నాయకులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. కూటమి ప్రభుత్వంలో విద్యా వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నామని అనారోగ్యంతో ఎవరూ బాధపడకుండా ప్రతి ఒక్కరు వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరం సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, అడపా ప్రసాద్ మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular