- Advertisement -
గర్భిణీకి పురిటి నొప్పులు
Pregnant women have stomach painsడోలీలో 5 కి.మీ. ప్రయాణం
అనకాపల్లి
గురువారం అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో గర్భిణీని డోలీలో సుమారు 5 కిలో మీటర్లు మోసుకెళ్లిన ఘటన ఏపీలో అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. కూటమి గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ ప్రజలు సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అనకాపల్లి జిల్లాలో రోలుగుంట మండలం పితృగడ్డ కొండ శిఖరంలో కొర్ర దేవి అనే గర్భిణీకి గురువారం రాత్రి 12 గంటలకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో భర్త కొర్ర రమేష్ కుటుంబ సభ్యుల సహకారంతో డోలీలో కొర్ర దేవిని 5 కి.మీ. మోసుకెళ్లారు. అనంతరం అంబులెన్స్కు ఫోన్ చేయగా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ఆటోలో బుచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించారు.
- Advertisement -




