భూ సమస్యల కోసమే గ్రామ సభ…

- Advertisement -

భూ సమస్యల కోసమే గ్రామ సభ…

Gram Sabha is for land issues...

కొలిమిగుండ్ల, అక్టోబర్ 23
కొలిమిగుండ్ల మండలంలోని బెలుము సింగవరం గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ టిడిపి నాయకుడు డి. శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు నాయకులు గ్రామ ప్రజలతో కలిసి గ్రామసభను బుధవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సర్వేయర్ సరిత మాట్లాడుతూ రీ సర్వేలో భూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు సర్వేయర్ సరిత సభలో తెలిపారు. గ్రామంలో ఏవైనా భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే వాటిని రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలిస్తామని ఆమె తెలిపారు. అనంతరం గ్రామంలో ఉన్న ప్రజలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పడిపోవడంతో ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కోరుతూ గ్రామంలోని ప్రజలు వినతి పత్రాలను మండల సర్వేయర్ సరిత, వీఆర్వో నారాయణరెడ్డి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో డి.శంకర్ రెడ్డి, శీలం నాగేశ్వర్ రెడ్డి, బిజ్జము పెద్ద రామ సుబ్బారెడ్డి, కైప వెంకట్రామిరెడ్డి, కే .వెంకటేశ్వర్ రెడ్డి, మల్లు ఎర్రపురెడ్డి, వీఆర్వో నారాయణరెడ్డి, మండల సర్వేయర్ సరిత, పర్వేజ్, సురేష్, తలారి దస్తగిరి, అంగన్వాడి టీచర్ రంగమ్మ, ఆశా వర్కర్ మల్లేశ్వరి, బాల కంబయ్య, విశ్వనాథం, వెంకటసుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం, పక్కీర, అచ్చమ్మ, దేవి, ఏపీ ఎమ్మార్పీఎస్ కొలిమిగుండ్ల మండల అధ్యక్షుడు కృష్ణయ్య, కట్టుబడి రామ్మోహన్, జైపాల్, ఇంకా అధికారులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular