దస్తగిరిమ్మ కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం
Government has given financial assistance 10 lakh rupees to Dastagirimma's familyచెక్కు అందించిన కడప జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అదితి సింగ్
కుటుంబ సభ్యులతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
బద్వేలు
బద్వేల్ లో దారుణ హత్యకు గురైన విద్యార్థిని దస్తగిరిమ్మ కుటుంబానికి బుధవారం ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసింది ప్రభుత్వం చేసిన సహాయాన్ని కడప జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదితి సింగ్ చెక్కు రూపంలో హతురాలి తల్లిదండ్రులకు అందించారు ఇదే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దస్తగిరిమ్మ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి వారికి అన్ని విధాలుగా న్యాయం చేస్తావని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి మరియు బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థి దస్తగిరమ్మ కుటుంబానికి ఇంచార్జ్ కలెక్టర్ అతిథి సింగ్ గారు 10 లక్షల రూపాయల చెక్కును అందజేయడంతో పాటు బాధితురాలు తల్లికి ప్రభుత్వ ఉద్యోగం బాధితురాలు తమ్ముడికి ఎన్టీఆర్ స్కూలు లో ఉచితంగా విద్య అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డిఓ చంద్రమోహన్ , ఎమ్మార్వో మున్సిపల్ కమిషనర్ బద్వేలు అసెంబ్లీ కూటమి అభ్యర్థి రోశన్న తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు




