- Advertisement -
పూతలపట్టు నాయుడుపేట రహదారిపై సిపిఐ రాస్తారోకో…
CPI will be written on Puthalapattu Naidupet road... తిరుపతి
పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రతిరోజు జరుగుతున్న యాక్సిడెంట్స్ నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు తనపల్లి సర్కిల్లో తిరుపతి జాతీయ రహదారి పై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ తిరుపతి జాతీయ రహదారి నాసిరికంగా నిర్మించడం వల్ల అతి పెద్ద తిరుపతి నగరానికి ఆనుకొని జాతీయ రహదారి ఉండడంతో కూడలిలో ఫ్లై ఓవర్లు, సర్వీస్ రోడ్లు, సబ్ వేలు, లైట్లు వేయకపోవడం వల్ల ప్రతిరోజు సర్కిల్స్ లో యాక్సిడెంట్స్ జరగడం వల్ల ప్రజల ప్రాణాలు పోవడం జరుగుతున్నదని, ప్రజల ప్రాణాలు పోతున్న కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు గానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ జాతీయ రహదారి పూర్తిస్థాయిలో నిర్మాణం జరగకపోయినా టోల్ ప్లాజా దగ్గర వందల కోట్లు వసూలు చేస్తున్నారే తప్ప జాతీయ రహదారి పూర్తి చేయడంలో వైపల్యం చెందారని దుయ్యబట్టారు. ప్రతిరోజు తిరుమల దర్శనార్థం కేంద్రా, రాష్ట్ర మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇతర వి ఐ పి లు అదే రహదారిలో వస్తున్న వారికి మాత్రం రక్షణ కల్పిస్తున్నారు తప్ప ప్రజలకు ఏ మాత్రం రక్షణ లేదని వాపోయారు. గత సంవత్సరం 60 మందికి పైగా చనిపోయారని, 300 మందికి పైగా గాయాలు అయ్యాయని, గత 12 సంవత్సరాలుగా వందల మంది ప్రాణాలు పోతున్న తిరుపతి జాతీయ రహదారిని మాత్రం పూర్తి చేయకుండా, ఫ్లై ఓవర్ నిర్మించకుండా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి తిరుపతి జాతీయ రహదారి కూడలిలో ఫ్లైఓవర్లు నిర్మించారు అందుకనుగుణంగా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని, లేనియెడల తిరుపతి ప్రజలను చైతన్యవంతం చేసి దశలవారీగా పోరాటాలు చేసి ప్రభుత్వాలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు కే రాధాకృష్ణ, బండి చలపతి, బి నదియా నగర కార్యవర్గ సభ్యులు ఎం శివ, ఎన్ డి రవి, కే పద్మనాభరెడ్డి, కే వై రాజా, ఎన్ మంజుల, ఎన్ శ్రీరాములు, కాళయ్య, వైయస్ మణి, మునీశ్వర్, నాగభూషణం, విజయమ్మ, వెంకటేష్, ప్రమీల, అలివేలమ్మ, పూర్ణ ,ఆర్ వి రమేష్, సురేష్ ,పార్వతి తదితరులు తో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -




