లిడ్ క్యాప్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడండి…

- Advertisement -

లిడ్ క్యాప్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడండి…

Protect lid cap lands from alienation...

తిరుపతి
లిడ్ క్యాప్ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడండి అని ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుల్లా రాజారావు విజ్ఞప్తి చేశారు.:తిరుపతి రూరల్ దామినేడు గ్రామం లెక్కదాకల 71, 71/2,72/3, 101/2 సర్వే నెంబర్లలో గల ఏడు ఎకరాల భూమిని 1978 -79 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండు మాదిగ చర్మ కార్మికుల కొరకు, చెప్పుల తయారీ కార్మికుల కొరకులిడ్ క్యాప్ సంస్థకు కేటాయించింది. ఈ క్రమంలో లిడ్ క్యాప్ భూములు నిరుపయోగంగా ఉండడంతో .ఆంధ్రప్రదేశ్ చర్మకార సేవా సంఘం అధ్యక్షులు పుల్ల రాజారావు  సందర్శించారు. ఈ ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుపయోగంగా  ఉన్న ఈ లిడ్ క్యాప్ భూములను చర్మకార కార్మికులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా లిడ్ క్యాప్ పరిశ్రమకు తగిన విధంగా  రాయితీలు కల్పించి పునర్ వైభవం తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర మాదిగ మహా సంఘం అధ్యక్షుడు సుధాకర్ బాబు మాట్లాడుతూ లిడ్ క్యాప్ భూములను పట్టించుకునే నాధుడు లేదని అలా పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పెచ్చు మీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు భూ బకాసురులు లిడ్ క్యాప్ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నించగా మాదిగ లిడ్ క్యాప్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వారిని నిలువరించామని అన్నారు.అలాగే తిరుపతి మాదిగ లిడ్ క్యాప్ పరిరక్షణ కమిటీ చైర్మన్ సుబ్బయ్య మాట్లాడుతూ లిడ్ క్యాప్ సంస్థ ద్వారా దాదాపుగా 1000 కుటుంబాలు గతంలో బతికేయమని కానీ ఆ తర్వాత వచ్చిన పాలకుల నిర్లక్ష్యం వల్ల లీడ్ క్యాబ్ సమస్త మూతపడిందని ప్రస్తుతం ఉన్న భూములను సైతం కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిట్ క్యాప్ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు పి సుబ్బయ్య, శర్మ కార్మికుల సేవా సంఘం అధ్యక్షుడు బల్ల రాజారావు, మాదిగ మహాజన సంఘం స్టేట్ సెక్రటరీ సుధాకర్ బాబు, మాదిగ రిట్ క్యాప్ అధ్యక్షులు వెంకటచలం, తిరుపతి రూరల్ జనసేన ఉపాధ్యక్షులు రాంబాబు, కాటయ్య, మురళి, భాస్కర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు లిడ్ క్యాప్ సంస్థ సభ్యులు, సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular