- Advertisement -
టీటీడీ చైర్మన్ కు ఆప్యాయత పులకరింపు
Affectionate words to TTD Chairman's
బద్వేలు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడు నియమితులైన విషయం తెలిసిందే.ఈ మేరకు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం లోని బోవిల్లవారిపల్లెకు గ్రామానికి చెందిన సానుపు రెడ్డి గోపాల్ రెడ్డి పెద్ద కుమారుడు రామ గోపాల్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదరాభిమానాలతో కలిసిన వీరు ఇరువురు చిరకాల మిత్రులు. పుష్ప గుచ్చాన్ని ఇచ్చిన అనంతరం పలు రకాలైన అంశాలపై చర్చించుకున్నారు.కాగా బోవిల్లవారిపల్లెకు వారి పల్లెకు చెందిన రామగోపాల్ రెడ్డి ఆలయాలతో పాటు పలు రకాలైన స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. అనతి కాలంలోనే వ్యాపారవేత్తగా ఎదిగిన ఈయన భావితరాలకు ఆదర్శవంతం అని చెప్పక తప్పదు
- Advertisement -



