రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం

- Advertisement -

రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం

Minister Ponnam visited Rajanna

రాజన్నసిరిసిల్ల
దర్శించుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని కోడెమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈనెల 20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి

వస్తున్నారు. సీఎం సిరిసిల్ల లో ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం తోపాటు వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజన్న ఆలయ అభివృద్ధి, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు, టెక్స్ టైల్స్

సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళాం. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. రైస్ మిల్లర్లు రూ. 20 వేల కోట్ల బకాయి ఉన్నారు. బకాయి ఉన్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం లేదు.  సన్న ధాన్యానికి

రూ.500 బోనస్ ఇస్తున్నాం… భవిష్యత్ లో రైతులు సన్నాలు సాగు చేయాలి.  గత ప్రభుత్వంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయం చెప్పడానికి, ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం ఉండేది

కాదని మంత్రి అన్నారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో స్వేచ్ఛ  ఉంది. వికారాబాద్ కలెక్టర్ పై దాడి నేపథ్యంలో అరెస్టు చేస్తే రైతులను ఏలా అరెస్టు చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం అర్థరహితం. నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ దాడి

చేయడం క్షమించరాని నేరం.  వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటి బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular