వార్డెన్ వేధింపులతో ఇద్దరు విద్యార్దినీలు ఆత్మహత్యాయత్నం

- Advertisement -

వార్డెన్ వేధింపులతో ఇద్దరు విద్యార్దినీలు ఆత్మహత్యాయత్నం

Two female students attempted suicide due to harassment by the warden

పల్నాడు
సత్తెనపల్లి వెంకటపతి కాలనీ ఎస్సీ హాస్టల్లో  మాత్రలు మింగి ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య యత్నం చేసారు. విద్యార్థినీలు సరిత (19), అఖిల (16) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హాస్టల్ వార్డెన్ రాణి వేధింపులే కారణమని  విద్యార్థినీలు చెబుతున్నారు. భోజనం బాగోలేదని పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినందుకు ఏదో ఒక వంకతో టార్చర్ పెడుతుందని ఆరోపించారు. హాస్టల్ వార్డెన్ తీరు పై విద్యార్థినిల తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసారు. బాధితులు సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular