- Advertisement -
టీఆర్ఆర్.. హాస్పిటల్ జన ప్రాచుర్యం పొందాలి
TRR.. Hospital should be popularనగరంలో కొత్త ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం :
నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీఆర్ఆర్ ఆర్థో, యాక్సిడెoట్ కేర్ హాస్పిటల్ జనo విశ్వాసాన్ని చూరగొని బాగా ప్రాచుర్యం పొందాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం ఆయన.. అత్యవసర సేవల విభాగం, ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అందరికీ అందుబాటులో ఉంటూ.. మెరుగైన వైద్య సేవలు
అందిస్తూ.. మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్ దంపతులకు, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తోట రామారావు, గోవిందమ్మ దంపతులు, కార్పొరేటర్ శీలంశెట్టి రమ, శీలంశెట్టి వీరభద్రం, కాంగ్రెస్ నాయకులు కొప్పుల చంద్రశేఖర్, నాయకులు మిక్కిలినేని నరేందర్, పలువురు ప్రజాప్రతినిధులు.. తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




