ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణకై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి

- Advertisement -

ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణకై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలి

We need to prepare for active struggles to protect the public education sector

—-
విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణగా వ్యతిరేకంగా పోరాడుదాం

—-
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు వెంటనే కల్పించాలి


ఏఐఎస్ఎఫ్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.శివారెడ్డి

నరసరావుపేట,
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో సిపిఐ కార్యాలయం నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) పల్నాడు  జిల్లా ప్రధమ మహాసభను నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పంజాబ్ బ్యాంక్ సెంటర్ వద్ద నుండి సిపిఐ కార్యాలయం వరకు వందలాది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్  జిల్లా నాయకులు మధు అధ్యక్షతన నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి మాట్లాడుతూ, పొత్తిళ్లలోనే పిడికిలి బిగించి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు. 89 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని , అందరికీ సమానమైన విద్యా విధానం కావాలని పొరాటాలు కొనసాగిస్తూనే ఉందని అన్నారు.   కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వలన పేదలకి విద్య అందని ద్రాక్ష లాగా తయారవుతుందని,  ఇప్పటికే రేసలైజేషన్ పేరుతో దేశవ్యాప్తంగా 60 వేల ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్లో విలీనం చేయడం జరిగిందని దీనివలన లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలలో జాతీయ విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి సీట్ల సంఖ్యను కుదించి వేయడం వలన ఉన్నత విద్య మరింత ఖరీదుగా తయారవుతుందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల నాసర్ జీ మాట్లాడుతూ, సుమారుగా 70 వేల మంది sc, st, bc విద్యార్థులు జీవో నెంబర్ 77 వలన ఉన్నత పీజీ విద్యకు దూరమవుతున్నారని. గతంలో యువగళం పాదయాత్రలో నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న  నారా లోకేష్ జీవో నెం 77 ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట మీద నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని  పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మటిక్  చార్జీలను విడుదల చేయాలని అన్నారు. విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ కాషాయీకరణ కు వ్యతిరేకంగా,  ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలకు సన్నద్ధమవుతున్నామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశానికి అతిధిలుగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నూతన జిల్లా అధ్యక్షుడిగా నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా మధు, కోశాధికారిగా కాసా గోపి కృష్ణ, ఉపాధ్యక్షులుగా దాసరి హేమంత్, రాజా, సహాయ కార్యదర్శిలుగా వాగ్య నాయక్, అభిషేక్, బోధన శ్రీనివాసరావు లను, మరొక 21 మంది సమితి సభ్యులతో జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని నాయకులను తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular