రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ రాజ్యాంగ వ్యతిరేక కమిషన్
The Rajiv Ranjan Mishra Commission was an anti-constitutional commissionమాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్
—–
పల్నాడు జిల్లా కలెక్టర్ కి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ను వ్యతిరేకిస్తున్నాం
—-
మెమొరాండం ఇచ్చిన మాల మహానాడు రాష్ట్ర కమిటీ
నరసరావుపేట,
పల్నాడు జిల్లా కలెక్టర్ కి స్పందనలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ తోపాటు నరసరావుపేట నియోజకవర్గం కమిటీ మెమొరాండం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాలలను అణచివేసే దోరణిలో రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసే ప్రత్యేక కమిషన్ ను నియమించే అధికారం లేదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ కమిషన్ ఉండగా మరొక కనీషన్ వేసి ప్రభుత్వానికి అనుకూలంగా వారి ఓటు బ్యాంకు రాజకీయ ప్రయోజనాల కోసం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేశారని ఏదో విధంగా తప్పుడు లెక్కలతో మాదిగలకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించే ప్రయత్నాలు ప్రభుత్వ మానుకోవాలని, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియామక నోటిఫికేషన్ పరిశీలిస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఎంపేరికల్ డేటా మరియు క్రిమిలేయర్లను అమలు చేసే విధంగా రాజ్యాంగ వ్యతిరేక కమిషన్ ను వాడుకోవాలని ప్రభుత్వం చూస్తుందని దీనివలన మాలలతో పాటు మాదిగలు కూడా నష్టపోతారని ఉన్న రిజర్వేషన్స్ కే ప్రమాదం పొంచి ఉందనీ దానిలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా టీచర్ల ఉద్యోగాల నియామకాల్లో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్ కేవలం ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల తో పాటు అగ్రవర్ణాలలో ఉన్న నిరుద్యోగుల జీవితాలతో ఆడుకునే విధంగా డీఎస్సీ ని నిలిపివేయటం దారుణమని మిగిలిన కులాల యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాలని ఉద్దేశిపూర్వకంగా వ్యవహరించడం ఈ నిలిపివేతకు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మాల వ్యతిరేక విధానాలతో పాటు మిగిలిన కులాల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మాలలతో పాటు నిరుద్యోగ యువతీ యువకులను, ప్రజాస్వామ్య వాదులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మాల మహానాడు నరసరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు ఉస్తేల జయరావు, నరసరావుపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సేవా సామేలు, కాకి చార్లీ, కీర్తి పాటి ప్రసన్న, ఉన్నం వెంకటరావు తదితరులు ఉన్నారు.




