- Advertisement -
అసెంబ్లీ సాక్షిగా టిట్కో ఇళ్ల కష్టాలు తెలియజేసిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
MLA Sriram Tathaiah said about Ticto House problems as a witness in assembly అభినందనలు తెలియ జేసినజాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్
విజయవాడ నవంబర్ 18
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన ఐదేళ్లుగా టిట్కో ఇళ్ల పరిస్థితిలో ఎటువంటి మార్పులు రాకపోగా సినిమా కష్టాలు లాగా పరిస్థితులు మారిపోయాయని జరుగుతున్న గందరగోళంలో వాస్తవాలు ఏంటి వాటికి చేయాల్సిన మార్పులు ఏంటి అనే విషయం ప్రతి చోట గందరగోళంగా ఉన్న పరిస్థితుల్లో నేడు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అసెంబ్లీ సాక్షిగా విశదీకరించారు. రాష్ట్రంలో టిట్కో బాధితుల కష్టాలను వాటి పరిష్కారం మార్గాలను వాస్తవాలు తెలియజేసి జరగాల్సిన వాస్తవాలు అనగా బ్యాంకు కి ప్రభుత్వమే ప్రజలకు డబ్బుకు గ్యారెంటీగా ఉండి ఈ నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేస్తే మాత్రమే మోక్షం ఉంటుందని పేర్కొన్నారు.ప్రజలకు అనేక రకాలుగా సిబిల్ బ్యాంకు లో ఇబ్బందులు లబ్ధిదారుల వయసు అనేక రకాల ఇబ్బందులు ముడిపడి ఉన్న ప్రభుత్వం అండగా ఉండి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రత్యేక విజ్ఞప్తి చేయడం పట్ల ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ వ్యవహారాల ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ ప్రజాసంఘాల తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాగే ప్రతి ఎమ్మెల్యే ప్రతిపక్షం లేని శాసనసభలో ప్రజా అవసరాల పట్ల గొంతుకై నిలబడాలని పిలుపునిచ్చారు. టీట్కో ఇల్లా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు త్వరగా పరిష్కారం చేయాలని వేణుమాధవ్ విజ్ఞప్తి చేశారు
- Advertisement -




