- Advertisement -
దోస్త్… మేరా దోస్త్…
Dost... Mera Dost...
కూటమిలో పార్టీల ఐక్యతా రాగం
కాకినాడ, నవంబర్ 20, (వాయిస్ టుడే)
కలిసుంటే కలదు సుఖం. కూటమిగా ఉంటేనే బలం. ఉమ్మడిగా వెళ్తేనే విజయం అంటున్నారు సీఎం చంద్రబాబు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ఇవే డైలాగ్స్ రిపీట్ చేస్తున్నారు. అటు కమలం లీడర్లు దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు. 2014లో ఆ ముగ్గురి దోస్తీ సార్ట్ అయింది. 2019లో బ్రేక్ పడినా..2024కు వచ్చేసరికి పొలిటికల్ పిక్చర్ బద్దలు అయిపోయింది. అలాంటప్పుడు ఎవరిదారి వాళ్లు ఎందుకు చూసుకోవాలి. కలసి నడిస్తేనే కదా..అసలైన కిక్కు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.టీడీపీ, జనసేన, బీజేపీ ఫ్యూచర్ పాలిటిక్స్‌పై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అంతకముందు బీజేపీతో చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నప్పటికీ..2014లో ఫస్ట్ టైమ్ ఈ మూడు పార్టీలు కలసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. 2019లో విడిగా పోటీ చేసి ఓటమిని చవి చూశారు. 2024కు వచ్చేసరికి ఉమ్మడిగా బరిలోకి దిగి..నెవర్ బిఫోర్ పొలిటికల్ హిస్టరీ క్రియేట్ చేశారు. దాంతో ఇక వీడేది లేదు. ఒకరిని ఒకరు విడిచిపెట్టేది లేదు. ముగ్గురం ఒకటే. అందరి ఎజెండా అభివృద్ధే అంటూ నవ్యాంధ్ర ఫ్యూచర్ పాలిటిక్స్‌పైనా బాబు ఓ క్లారిటీకి వచ్చేశారు.కూటమి ఫ్యూచర్‌పై హస్తిన వేదికగా సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అవుతున్నాయి. జమిలి ఎన్నికలు వచ్చినా..2029లో ఎలక్షన్స్ జరిగినా కలసే పోటీ చేస్తాం..ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నామంటూ బాబు చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని, కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నామని..చంద్రబాబు స్పష్టం చేశారు. నరేంద్ర మోదీనే తమ నాయకుడని, ఆయన నేతృత్వంలోనే ముందుకు వెళ్తామని కూడా చెప్పారు.ఇక్కడే బాబు మార్క్ రాజకీయం, థర్టీ ఇయర్స్ పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలసి పోటీ చేసినా..టీడీపీకి అధికారానికి కావాల్సినన్నీ సీట్లు వచ్చాయి. 135 ఎమ్మెల్యేలు..16 ఎంపీలు గెలుచుకుంది టీడీపీ. అయినప్పటికీ అటు కేంద్రంలో ఉన్న బీజేపీతోనూ..రాష్ట్రంలో జనసేనతో సఖ్యతతోనే ఉంటున్నారు బాబు. అధికారంలోకి వచ్చాం..అవసరమైపోయిందని కాకుండా..కలసి నడిస్తే పార్టీలకు, ప్రజలకు జరిగే మేలోంటి తెలిసిన నాయకుడిగా బిహేవ్ చేస్తున్నారు.ఏపీలో టీడీపీ ఓటు బ్యాంకుకు ఎప్పుడూ ఢోకా లేదు. అయితే ప్రభుత్వంలో ఏ పార్టీపై అయినా అంతో ఇంతో ప్రజావ్యతిరేకత కామన్. డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉండే ఆ ఓటు షేర్ మీదే పార్టీల గెలుపోటములు డిపెండ్ అయి ఉంటాయ్. అందుకే ఇప్పుడు బంపర్ మెజార్టీ, ఫుల్ లోడ్ స్రెంథ్‌తో ఉన్నా..లాంగ్ లివ్ కూటమి అంటున్నారు బాబు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ కంటే టీడీపీ ఓటు బ్యాంకే ఎక్కువ. ఆ పార్టీనే బూత్ స్థాయి వరకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది.అంత పటిష్ఠంగా ఉన్న పార్టీని లీడ్ చేస్తున్న అధినేతే కూటమి కంటిన్యూ అవుతుందని చెప్పడం దూరదృష్టికి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఒక్క రోజు కోసం కాదు..ఈ టర్మ్ కోసం అసలే కాదు..భవిష్యత్ ప్రణాళికతో బాబు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. బాబు టీడీపీకి సారథ్యం వహించినప్పటి నుంచి బీజేపీతోనే ఎక్కువసార్లు కలసి పోటీ చేశారు. 2014 నుంచి జనసేనతో దోస్తీ మొదలు పెట్టారు. క్యాస్ట్ ఈక్వేషన్లు, పార్టీ సిద్ధాంతాల పరంగా చూస్తే బీజేపీ, జనసేనకు ఏపీలో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకే ఉంది. అది తోడైతే విజయం ఈజీ అవుతుంది. ఇదే బాబు లాజిక్ అని పొలిటికల్ ఎనలిస్టులు చెప్తున్నారు.రాజకీయాలు అన్నప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మొన్నటి ఎన్నికల్లో లభించినంత ప్రజా మద్దతు ఎప్పటికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూటమిగా పోటీ చేస్తే..గత ఎన్నికల్లో వచ్చినంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాకపోయిన..ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇబ్బంది ఉండదనేది బాబు ప్లాన్ తెలుస్తోంది. సేమ్‌టైమ్ కలిసి కట్టుగా గెలిచారు..కూటమిగా ఎన్నాళ్లుంటారు.? మిత్రబంధం ఎప్పటిదాకా.? అన్న ప్రశ్నలకు కూడా టీడీపీ అధినేత కామెంట్స్‌తో క్లారిటీ వచ్చేసింది.క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్లు-బీజేపీ, జనసేనతో కలసి నడవాల్సిందేనని ఇండికేషన్ ఇచ్చారు. కూటమి నేతల మధ్య అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్‌లు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎండ్‌కార్డ్ వేసేలా పొత్తు పాలిటిక్స్‌పై బాబు స్పష్టత ఇచ్చినట్లు అయింది. గ్రౌండ్ లెవల్‌లో నాయకులు, కార్యకర్తలు..కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఉందనే సంకేతాన్ని కూడా పంపించారు. ఇలా కూటమి పార్టీలకు..మరీ ముఖ్యంగా టీడీపీ క్యాడర్‌కు..అపోజిషన్ వైసీపీకి..ఫ్యూచర్ పొలిటికల్ సినారియో ఎలా ఉంటుందో..చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు
- Advertisement -