కడప జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి
Kadapa district should be led on the path of development ఆకాంక్ష జిల్లాల ఆశయసాధన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
బద్వేలు
ఆకాంక్ష జిల్లాల (ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్) ఆశయాలకు అనుగుణంగా… అధికారులు జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.కలెక్టరేట్ బోర్డు రూమ్ హాలు నుండి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన “ఆకాంక్ష జిల్లాల ఆశయసాధనలో భాగంగా జిల్లాలో కార్యాచరణ, ప్రగతి”పై సంబందిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష చేశారు.ఈ సందర్బంగా.. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. “నీతీ ఆయోగ్” ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కొన్ని ఆకాంక్ష జిల్లాలను ఎంపిక చేసిందన్నారు. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాల్లో సామాజిక స్థాయిని(అభివృద్ధి)… ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ప్రతి మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరానికి ఒకసారి.. 6 అంశాలకు సంబంధించి.. కీ పారామీటర్ ఇండికేట్ (కెపిఐ) పాయింట్ల ఆధారంగా.. ప్రగతిని లెక్కించడం జరుగుతుందన్నారు. అందులో.. ముఖ్యంగా హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ – నైపుణ్యాభివృద్ధి, గృహనిర్మాణం, వ్యవసాయం, పశుపోషణ, మౌలిక సదుపాయాలు …మొదలైన శాఖల్లో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అందుకోసం.. సంబందిత శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సంతృప్త స్థాయిలో నిర్దేశిత లక్ష్యం మేరకు సాధించిన ప్రగతి ఆధారంగా.. ప్రోత్సాహకాలను కూడా భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఆ మేరకు.. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
అన్ని శాఖల పరిధిలో కొరత ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు, అవసరాలను ఎప్పటికప్పుడు సంపూర్తి చేయాలన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ ఇన్నోవేటీవ్ గా ఆలోచించాలన్నారు. అందుకు సంబందించి రోజువారీ డేటా ఎంట్రీలో ఎక్కడా గ్యాప్ లేకుండా.. ఎప్పటికప్పుడు డేటాను ఫుల్ ఫిల్ చేయాలన్నారు. వినూత్నమైన ఆలోచనలకు నిర్మాణ రూపం ఇచ్చేందుకు ప్రతి శాఖ సంసిద్ధం అవ్వాలని.. జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నాగరాజు, డిఆర్డీఏ పిడి ఆనంద్ నాయక్,ఐసిడిఎస్ అధికారిని శ్రీలక్ష్మి, సీపీఓ వెంకటరావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజరు జనార్ధన్, ఏపీఎంఐపి పీడీ వెంకటేశ్వర రెడ్డి,తదితర అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యారు.




