Thursday, November 21, 2024

సిండికేట్ గా ఏర్పడి ఆసుపత్రుల నుండి డబ్బులు దండుకుంటున్న వైసీపీ సానుకూల ఉద్యోగులు

- Advertisement -

సిండికేట్ గా ఏర్పడి ఆసుపత్రుల నుండి డబ్బులు దండుకుంటున్న వైసీపీ సానుకూల ఉద్యోగులు

Positive employees of YCP are forming syndicate and extorting money from hospitals

భూమిని ఆక్రమించుకున్నాడంటూ ఏసీబీ డీఎస్పీపై బాధితుడు ఫిర్యాదు
అనంతపురం జిల్లాలో 10 ఎకరాలు పైన ఉన్న రైతులకు కూడా ప్రభుత్వ పథకాలు అందించాలని జిల్లా     వాసులు విజ్ఞప్తి

ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో గతంలో వైసీపీ నేతల అండదండలతో రిక్రూట్ అయిన ఉద్యోగులు వివిధ హోదాల్లో ఉండి ఇతర ఉద్యోగులను అవమానిస్తూ.. ప్రభుత్వ మద్దతు దారులను వేధింపులకు గురిచేస్తున్నారని. వారు సిండికేట్ గా ఏర్పడి ఆసుపత్రులతో లాబీయింగ్ చేస్తున్నారని.. పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని.. కావున ప్రభుత్వం వారిపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు లకు కట్టెపోగు వెంకయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వాస్తవాలను విచారించి చర్యలు తీసుకునేలా చూస్తామని నేతలు అర్జీదారునికి హామీ ఇచ్చారు.

తమ భూమిని ఏసీబీ డీఎస్పీ మహబూబ్ బాష ఆక్రమించుకున్నాడని.. అతని ఆక్రమణపై  మండల రెవెన్యూ అధికారులకు, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. అతని భూ ఆక్రమణపై విచరణ చేపట్టి తమ భూమిని తమకు విడిపించాలని కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాల్వ గ్రామానికి చెందిన  కె. శ్రీనివాసులు నేతల ముందు వాపోయాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్