- Advertisement -
మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేల మధ్య టఫ్ ఫైట్
Tough fight between MLAs for ministerial post
నిజామాబాద్, నవంబర్ 21, (వాయిస్ టుడే)
ఆ జిల్లాలో ఓ పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పోటాపోటీ నెలకొంది. ఒకరు తొలిసారి ఎమ్మెల్యేగా గెలవగా.. మరొకరు మంత్రిగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రజాప్రతినిధి. ముఖ్యమంత్రి సహా కొందరు సీనియర్లు ఆ మాజీ మంత్రికి జై కొడుతుంటే ఢిల్లీ పెద్దలు మాత్రం.. ఆ జూనియర్ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఆ క్రమంలో ఆ ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ స్టార్ట్ అవ్వడంతో ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కాంగ్రెస్ పెద్దల ఫార్ములా ఓకే అయిందంట.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హస్తం పార్టీలో.. మంత్రి పదవి కోసం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందట. బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు లు రేవంత్ క్యాబినెట్ లో బెర్త్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారట. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ తన పేరు పరిశీలించాలంటూ రాహుల్ టీంతో ఒత్తిడి చేయిస్తున్నారట.దాంతో సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైనా.. మదన్ మోహన్ ప్రయత్నాలతో అధికార ప్రకటనలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందంటున్నారు. రాహుల్ టీం మదన్ మోహన్ పేరు సిఫార్సు చేస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం సీనియర్ అయిన సుదర్శన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారట. అదే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పొలిటికల్ ఫైట్‌కు కారణమైందంట. సీనియర్ ఎమ్మెల్యే.. జూనియర్ ఎమ్మెల్యే మధ్య రాజీ కుదుర్చేందుకు హస్తం నేతలు ప్రయత్నాలు చేస్తున్నా.. సమన్వయం కుదరటం లేదట. మంత్రివర్గ విస్తరణ జాప్యానికి.. ఇదో కారణంగా చెబుతున్నారు.మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి.. తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగినా.. మిస్ అయింది. సుదర్శన్ రెడ్డి సేవలను స్పీకర్ గా వినియోగించుకోవాలని పార్టీ పెద్దలు ప్రతిపాదిస్తే భావించినా.. ఆయన ససేమిరా అన్నారట. క్యాబినెట్ బెర్త్ కోసం పట్టుబట్టి .. అంతా ఓకే అనుకునే సమయానికి.. నేనున్నానంటూ తెరపైకి మదన్ మోహన్ వచ్చారట. రాహుల్ టీమ్‌తో రాయబారాలు నడిపారంట. దాంతోమంత్రి వర్గ విస్తరణ జరిగితే.. మదన్ పేరు పరిశీలించాలని ఢిల్లీ పెద్దలు చెప్పారట. దాంతో ఆ పక్రియ మళ్లీ మొదటికొచ్చిందట.ఐతే ఇటీవల పార్టీ పెద్దలు మదన్‌తో చర్చలు జరిపి చీఫ్ విప్ పదవి ప్రతిపాదన చేశారట. ఆ ప్రతిపాదనకు నో చెప్పలేక ఎస్ అనలేక సర్దుకుపోతా అని మదన్ సంకేతాలిచ్చారట. దీంతో సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి, మదన్‌మోహన్‌కు చీఫ్ విప్ పదవి దాదాపుగా ఖరారయ్యాయన్న ప్రచారం జరుగుతుంది. చీఫ్ విప్ అంటే క్యాబినెట్ హోదా లభిస్తుంది. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లు సీనియర్, జూనియర్‌లు ఇద్దరికీ పదవులు దక్కితే నిజామాబాద్ జిల్లాకు రెండు క్యాబినెట్ పదవులు దక్కుతాన్నమాట.. మరి ఆ లాంఛనం ఎప్పుడు పూర్తవుతుందో అని ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులు తెగ టెన్షన్ పడుతున్నారు.
- Advertisement -