ఆళ్లగడ్డలో ఘనంగా వరల్డ్ టెలివిజన్ డే వేడుకలు..

- Advertisement -

ఆళ్లగడ్డలో ఘనంగా వరల్డ్ టెలివిజన్ డే వేడుకలు..

World Television Day celebrations in Allagadda

ఆళ్లగడ్డ:
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం వరల్డ్ టెలివిజన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు…పట్టణ టి.వి మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక స్ఫూర్తి మదర్ హోమ్ లో విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు, ప్యాడ్స్ ను అసోసియేషన్ సభ్యులు పంపిణీ చేశారు…పిల్లలకు భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టివి మెకానిక్ ట్రేడ్ యూనియన్ కార్యవర్గ సభ్యులు ట్రెజరర్ రామకృష్ణ  ట్రెజరరు మున్నా మాట్లాడుతూ స్ఫూర్తి మదర్ హోం పిల్లల నడుమ టెలివిజన్ డే వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వం టి.వి మెకానిక్ లను కార్మికులుగా గుర్తించాలని వారు సూచించారు . ప్రభుత్వ పరమైన ప్రయోజనాలను అన్నింటిని టి.వి మెకానిక్ లకు కూడా కల్పించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు ఆళ్లగడ్డ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ,వైస్ ప్రెసిడెంట్ పల్లా ప్రభాకర్,సెక్రటరీ షరీఫ్, ట్రెజరరు మున్నా,  గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు,గౌరవ సలహాదారు మాణ్యం,మరియు అసోసియేషన్ సభ్యులు శ్రీను,అక్బర్, శివ,లింగేశ్వర్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular