- Advertisement -
రామకుప్పంలో కిడ్నాపర్ల ముఠా అరెస్ట్
Gang of kidnappers arrested in Ramakuppamచిత్తూరు
కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో కిడ్నాపర్ల ముఠాను గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14న మండలంలోని గోవిందపల్లి మాజీ సర్పంచ్ కుటుంబాన్ని ఐటీ శాఖ పేరుతో కిడ్నాప్ చేసిన సంగతి పాఠకులకు విధితమే. ఈ కేసులో ప్రధాన నిందితులు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల చెంత మూడు వాహనాలు సీజ్ చేశారు. రైస్ పుల్లింగ్ వ్యవహారంతో పాటు ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్ కు కారణమని తెలిసింది.
- Advertisement -




