కొనసాగుతున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అమెరికా పర్యటన
Ongoing MP Dr Byreddy Sabari's visit to Americaనంద్యాల
పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అమెరికా దేశ పర్యటన కొనసాగుతోంది
అగ్రరాజ్యం అమెరికా దేశం న్యూయార్క్ నగరంలో ఈ నెల 18 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు 79 వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలు జరుగుతున్నాయని, ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఇప్పటికే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు హెచ్.ఇ . ఫిలెమోన్ యాంగ్ తో పాటు నమీబియా శాశ్వత ప్రతినిధి నెవిల్లే మెల్విన్ గెర్డ్జ, ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్ లతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్య సమితి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.
అలాగే యునైటెడ్ నేషన్ ఆఫ్ ఫైనాన్స్ చైర్మన్ అబ్దుల్లా బబార్ బాంగ్, ఉగ్రవాద నిరోధక యు ఎన్ అండర్ సెక్రటరీ జనరల్ వ్లదిమీర్ వొడోన్కోవ్, జర్మన్ రాయబారీ అంట్లజ్ లీండర్ స్ట్స్ లతో భారత ప్రతినిధిగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సమావేశం అయ్యారు.




