వైద్య విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

వైద్య విద్యార్థి ఆత్మహత్య

Medical student suicide

అనంతపురం జిల్లా :

చదువు ఒత్తిడి భరించలేక వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. అనంతపురం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నాలుగవ సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్న రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వైద్య కళాశాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇంటికి వస్తున్నా నాన్న అని చెప్పి పరలోకాలకు వెళ్ళాడు :

ఉరవకొండ మండల కేంద్రం షిరిడి సాయి నగర్కు చెందిన గిద్దలూరు శివప్రసాద్ శారదల ప్రభుత్వ ఉపాధ్యాయులు వీరి కుమారుడే రోహిత్ అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతూ అదే వైద్య కళాశాలలోని వసతి గృహంలో ఉంటున్నాడు చదువు పరీక్షల విషయంలో తరచు ఒత్తిడికి గురవుతుండేవాడని సహచర విద్యార్థుల సమాచారం. ఈ ఒత్తిడికి గురవుతున్న కారణంగా గతంలో చికిత్స సైతం చేయించారు తల్లిదండ్రులు. డిసెంబర్లో 10 12 తేదీల్లో ఫైనల్ ఇయర్ పరీక్షలో ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం తన తండ్రి ఫోన్ చేసిన ఇంటికి వస్తున్నానని చెప్పాడు. సాయంత్రం ఉంటున్న గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వస్తున్న అని చెప్పిన తన కుమారుడు ఇంకా ఇంటికి రాలేదని తండ్రి రోహిత్ కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో తన వసతి గృహంలో ఉంటున్న సావచార విద్యార్థి విషయాలకు ఫోన్ చేసి తన తండ్రి ఆర తీశాడు తోటి విద్యార్థులు గది వద్దకు చేరుకొని కిటికీ నుంచి చూడగా అప్పటికే ఉరివేసుకొని రోహిత్ కనిపించాడు. విద్యార్థులు హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోహిత్ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular