కార్యకర్తల కష్టాల్లో పాలుపంచుకుంటా
Participates in the hardships of workersఅన్ని విధాలుగా అండగా ఉంటా..
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి
నల్లమాడ:28
టిడిపి కార్యకర్తల కష్టాల్లో వారి కుటుంబ సభ్యుడిగా తాను పాలుపంచుకుంటానని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లమాడ మండలం కోత్తపల్లి తండాలో టిడిపి కార్యకర్త లక్ష్మీపతి నాయక్ తండ్రి నానే నాయక్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఆ కుటుంబాన్ని గురువారం పరామర్శించి ఓదార్చారు. నానే నాయక్ అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి అన్నివేళలా అండగా నిలిచిన కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ తాను రుణపడి ఉంటానని తెలిపారు. వారి కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ వారి కుటుంబ సభ్యుడిగా భాగస్వామ్యునిగా ఉండి పాలుపంచుకుంటానని పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో పాటు పల్లె కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు .మృతుని అంత్యక్రియలకు మాజీ మంత్రి కొంత ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్లమాడ టిడిపి కుటుంబ సభ్యులు ,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




