- Advertisement -
పద్మావతి ఆలయంలో ధ్వజారోహణం
Flag hoisting at Padmavati Templeతిరుపతి
తిరుచానూరు శ్రీ పద్మా వతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవా లకు శాస్త్రోక్తంగా ధ్వజా రోహణం నిర్వహించారు. గురువారం ఉదయం అమ్మవా రికి సుప్రభాత సేవ, సహస్ర నామా ర్చన, నిత్య అర్చ న జరిపారు. అనంతరం ఉదయం 6.30 గంట లకు నాలుగుమాడ వీధుల్లో తిరు చ్చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు.అనంతరం ఈవో శ్రీ జె.శ్యామల రావు శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు.
- Advertisement -




