పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎన్ని కష్టాలైనా భరిస్తాం..నిరంతరంగా

- Advertisement -

పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎన్ని కష్టాలైనా భరిస్తాం..నిరంతరంగా

We will endure any hardships for economic development of poor women..continuously

సేవలను కొనసాగిస్తాం…
నాగిని రవిసింగారెడ్డి

నంద్యాల

పేదింటి మహిళలు శిల్పా కుటుంబంపైన4 చేపడుతున్న సేవాకార్యక్రమాలపై నమ్మకాన్ని ఉంచారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా శిల్పా సేవాసమితి ఆధ్వర్యంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ను నిర్వహిస్తున్నామని, తమకు ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా పేదింటి మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషిచేస్తామని శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని శిల్పా సేవాసమితి కార్యాలయం ఆవరణంలో 200 మంది మహిళలకు 21 లక్షల61వేల విలువగల చెక్కులను బ్యాంక్ చైర్పర్సన్ చేతులమీదుగా అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ మాట్లాడుతూ… గత 14 సంవత్సరాల నుండి శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ను నిరంతరాయంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పేదింటి మహిళల ఆర్థిక చేయూతకు తాము ఎన్ని కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు ముందుకు పోతున్నామన్నారు. రుణాలు తీసుకున్న మహిళలు క్రమం తప్పకుండా చెల్లించాలని, తోటి మహిళలకు సహకారం అందించాలని కోరారు. గెలిచినా ఓడినా శిల్పాకుటుంబం ఎప్పుడు ప్రజల ముందు ఉంటూ సేవలను అందిచడం జరుగుతుందని తెలిపారు. అందరు బాగుండాలని, అందులో ప్రతి ఒక్కరు ఉండాలని ఆకాంక్షించారు. భవిషత్తులో మరిన్ని సేవాకార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, శిల్పాసేవాసమితి మేనేజర్ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular