తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జి గా

- Advertisement -

తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జి గా

As a junior civil judge in the first attempt

ఎంపిక అయిన సత్తెనపల్లి యువతి షేక్ రోషన్

సత్తెనపల్లి,
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణానికి చెందిన షేక్ కరిముల్లా ,సుజాత  ఏకైక కుమార్తె షేక్ రోషన్ 2024 లో విడుదల అయిన జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్నారు. వివిధ దశల్లో జరిగిన విధానంలో సపళీకృతురాలు అయ్యారు. ఈమె తండ్రి ప్రవేటు ఉద్యోగి, తల్లి సత్తెనపల్లి ప్రధాన జూనియర్ జడ్జి (సివిల్ డివిజన్)కోర్టు లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షేక్ రోషన్ 1నుంచి 5 తరగతులు నెల్లూరు లోను, 6నుంచి 10 వరకు సత్తెనపల్లి ప్రగతి విద్యాసంస్థల్లో, ఇంటర్ గుంటూరులోను, అనంతరం క్లాట్ లో ర్యాంక్ సాధించటంతో విశాఖ లోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ లో 5 సంవత్సరాల లా విద్యను 2023 లో పూర్తి చేశారు. వెంటనే ఏ.పి బార్ కౌన్సిల్ లో న్యాయవాది గా ఎన్రోల్ అయ్యారు. వెను వెంటనే 2024 లో జూనియర్ సివిల్ జడ్జి నోటిఫికేషన్ విడుదల అవ్వటం ,తొలి నుంచి అన్నిట్లో ప్రథమ ర్యాంక్ లో నిలిచారు. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపిక అవ్వటంతో ఆమె తల్లి దండ్రులు ఆనందానికి అవధులు లేవు, అలాగే పలువురు న్యాయవాదులు ఆమెను అభినందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular