సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచిన కూటమి ప్రభుత్వం

- Advertisement -

సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచిన కూటమి ప్రభుత్వం

Kutami government has increased the speed in the implementation of welfare schemes

ఎన్టీఆర్ భరోసా ఫింఛన్లను ఎలాంటి జాప్యం లేకుండా లబ్ధి పొందేలా చర్యలు
వితంతువులకు .. 15 రోజుల్లోనే పింఛను లబ్ధి
ఏపీలో 63.92 లక్షల మందికి రూ.2709 కోట్ల ఎన్టీఆర్ భరోసా పింఛన్లు
పేదల సంక్షేమానికే కూటమి ప్రభుత్వం పెద్దపీట
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
గొల్లపూడి
ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా సీఎం చంద్రబాబు క్రమం తప్పకుండా ఫించన్లు అందిజేస్తున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు  తెలిపారు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. డిసెంబర్ నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో సామాజిక పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే…ఈనెల 30వ తేదీనే పంపిణీ చేస్తున్నట్లు ఇందుకు సంబంధించి పింఛన్దారుల జాబితాతోపాటు సొమ్ములు విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి పంచాయితీ పైపులరోడ్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular