- Advertisement -
దివ్యాంగుల ధర్నా
Dharna of the disabledహైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన దివ్యాంగులకు రూ వేలు పింఛన్ పెంచడంతోపాటు మిగతా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డీఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో దివ్యాంగులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నా లో డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డీఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు వల్లభనేని ప్రసాద్, ఉపాధ్యక్షుడు కే వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వి భారతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వి భారతి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న నేటికీ అమలు చేయకపోవడం దారుణం అన్నారు. ఈ సమస్యపై మంత్రి శ్రీధర్ బాబును రెండు మూడు సార్లు కలిసి వినతి పత్రాలు అందజేసిన నేటికీ స్పందన లేదన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి దివ్యాంగులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, చేయూత పథకం దివ్యాంగులకు 4000 వేల నుంచి 6000 పెంచాలని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు……
- Advertisement -




