- Advertisement -
గోసాయిగూడలోని పత్తిగోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం
A huge fire broke out in Pattigodown in Gosaigudaకాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన పత్తిగా గుర్తింపు
రూ.కోట్లల్లో ఆస్తి నష్టం
మేడ్చల్
మేడ్చల్ మండలం పూడూరు గ్రామ పరిధిలోని గోసాయిగూడలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందిన నిల్వ ఉంచిన పత్తి గోదాంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో గోదాం పూర్తిగా దగ్ధమైంది.కాగా ఇందులో నిలువ ఉంచిన పత్తి పూర్తిగా అగ్నికి ఆహుతైంది.గోదాం గేటుకు వెల్డర్ మరమ్మత్తులు చేస్తుండగా మెరుపులు ఎగిరి పత్తిలో పడడంతో మంటలు అంటుకున్నట్టుగా స్థానికులు తెలిపారు.కాగా సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక నిరోధక శాఖ అధికారులు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు.కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ బ్రాంచ్ కి చెందిన పత్తిగా సమాచారం.
- Advertisement -




