- Advertisement -
పిడిఎస్ రైస్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే..
Deputy Chief Minister Pawan Kalyan's actions on PDS rice are correct..
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
అమరావతి నవంబర్ 30
: పిడిఎస్ రైస్ పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చర్యలు సరైనవేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పిడిఎస్ రైస్ గురించి మాట్లాడామన్నారు. అంతర్జాతీయ పిడిఎస్ మాఫియాగా మారిందన్న పవన్ మాటల్లో తప్పు లేదన్నారు. బిజెపి నుంచి ఆదినారాయణ రెడ్డి సిఎంను కలిశారని తెలియజేశారు. టిడిపి నుంచి జెపి ప్రభాకర్ రెడ్డి కలవలేదని తెలిసిందన్నారు. ఫ్లైయాష్ అంశంలో సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పురందేశ్వరి వివరించారు. ఆంధ్రప్రదేశ్ లోిన కాకినాడలోని యాంకరేజ్ పోర్టును ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించిన విషయం విధితమే. పోర్టులోకి రైస్ ఎలా వస్తుందని ఎమ్మెల్యే కొండబాబుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -


