ఇక నుండి ప్రభుత్వ బడుల్లో ప్రోగ్రెస్ కార్డులు ఉండవ్..
కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం..!!*
Henceforth there should be no progress cards in government schools.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో కూటమి సర్కార్ సరికొత్త సంస్కరణలకు నడుం బిగిస్తుంది. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులకు బదులు హోలిస్టిక్ కార్డులు (సమగ్ర ప్రగతి పత్రాలు) ఇవ్వాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రతి తరగతికి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవారు. వీటిల్లో విద్యార్ధుల హాజరు, పరీక్షల్లో వారు సాధించిన మార్కులను పొందుపరిచే వారు. కానీ వీటి స్థానంలో కొన్ని మార్పులు చేసి హోలిస్టిక్ కార్డులను రూపొందించారు. వీటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇవ్వనున్నారు. హోలిస్టిక్ కార్డులు లోపల పేజీలో క్యూఆర్ కోడ్‌ను పొందుపరిచారు. ఫోన్ ద్వారా దీన్ని స్కాన్ చేసి.. విద్యార్థి అభ్యసన సవాళ్లను గుర్తించడానికి వీలుగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే విద్యార్థి అభ విద్యార్థి బ్లడ్ గ్రూప్, ఎత్తు, బరువు, బీఎంఐ వంటి తదితర అంశాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. హోలిస్టిక్ కార్డుల ద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చని విద్యాధికారులు చెబుతున్నారు..




