స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేస్తాం*
*మున్నూరు కాపులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం*
*తెలంగాణలో మున్నూరు కాపులను అణిచివేసేందుకు కుట్ర.*
*మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్.*
We will work against Congress in local body elections*హుజూర్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందున స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపులు వ్యతిరేకంగా పనిచేస్తామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ పేర్కొన్నారు. ఆదివారం హుజూర్ నగర్ లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లేపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో మున్నూరు కాపులకు కార్పొరేషన్ ప్రకటించిన ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నూరు కార్పొరేషన్ బదులుగా సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్నూరు కాపులకు చెప్పడం శోచనీయమన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత పది సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు , ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి… ఇప్పుడు అమలు చేయకపోవడం సరికాదన్నారు. కాపు కార్పొరేషన్ సంబంధించి జీవోను కూడా విడుదల ఎనిమిది నెలలు గడిచిన అమలు చేయకపోవడం అన్యాయం చేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ మాదిగానే కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేశారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మున్నూరు కాపుల ఆదుకుంటామని ప్రకటించారని తెలిపారు. తెలంగాణలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా మున్నూరు కాపుల మోసం చేయడం అందరూ బాబు సమాజాన్ని మోసం చేయడమేమన్నారు. తెలంగాణలో మున్నూరు కాపులు 60 లక్షల మంది ఉన్నారని .. వచ్చే ఎన్నికల్లో కాపులను మోసం చేసిన రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఎమ్మెల్యే, ఎంపీ ముందు మున్నూరు కాపులకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిజ స్వరూపాన్ని బయటపెట్టి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మున్నూరు కాపులకు ఎమ్మెల్యే టికెట్ల విషయాలు అన్యాయం చేశారని ఆవేదన చెందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 22 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పుడు అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా మున్నూరు కాపులను అణగదొక్కేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఓట్లు మావి సీట్లు మాకు కావాలని పేర్కొన్నారు. జనాభా ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించకుండా కాపులను నిర్లక్ష్యం చేశారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో మున్నూరు కాపు భవనానికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని, ప్రతి జిల్లాలో రెండు ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్లు నియమించి 3000 కోట్ల నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు. మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేసి నా వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. మున్నూరు కాపులు తెలంగాణలో రాజకీయ బలమైన శక్తిగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పదవీకాలం పూర్తయిన జిల్లా కమిటీలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం గ్లోబల్ అసోసియేషన్ ఫౌండింగ్ మెంబర్ రజనీకాంత్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల నాగేశ్వరరావు, లీగల్ సెల్ కన్వీనర్ ఊస రఘు, వుసా రవి, గాలి శ్రీనివాస్ నాయుడు, జిల్లా ఎన్నికల పరిశీలకులు చదల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ధనంజయ నాయుడు, అంబటి నాగేశ్వరరావు, వుసా పురుషోత్తం, శ్రీనివాసు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




