నిండు కుండలా మారిన జలాశయాలు

- Advertisement -

నిండు కుండలా మారిన జలాశయాలు

Reservoirs that have become full pots

తిరుమల, డిసెంబర్ 2, (వాయిస్ టుడే)
తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. వరదనీటి ప్రవాహంతో తిరుమలలోని మొత్తం ఐదు జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమ‌ల‌కు 200 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.పాపవినాశనం డ్యామ్ :- 694.25 మీ(FRL – 697.14 మీ)నిల్వ సామ‌ర్థ్యం – 5240 ల‌క్షల గ్యాలన్లుప్రస్తుత నిల్వ – 4345 ల‌క్షల‌ గ్యాలన్లుగోగర్భం డ్యామ్ – 2894 అడుగులు(FRL :- 2894 అడుగులు)నిల్వ సామ‌ర్థ్యం :- 2833.00 ల‌క్షల గ్యాలన్లు ప్రస్తుత నిల్వ :- 2833.00 ల‌క్షల‌ గ్యాలన్లుఆకాశగంగ డ్యామ్ :- 857.85 మీ(FRL :- 865.00 మీ)నిల్వ సామ‌ర్థ్యం :- 685.00 ల‌క్షల‌ గ్యాలన్లు ప్రస్తుత నిల్వ :- 306.50 ల‌క్షల‌ గ్యాలన్లు కుమారధార డ్యామ్ :- 891 మీ (FRL :- 898.24 మీ)నిల్వ సామ‌ర్థ్యం :- 4258.98 ల‌క్షల‌ గ్యాలన్లు ప్రస్తుత నిల్వ :- 2372.76 ల‌క్షల‌ గ్యాలన్లు పసుపుధార డ్యామ్ :- 896.40 మీ (FRL :- 898.24మీ) నిల్వ సామ‌ర్థ్యం :- 1287.51 ల‌క్షల గ్యాలన్లు ప్రస్తుత నిల్వ :- 950.39 ల‌క్షల గ్యాలన్లు తుపాను ప్రభావతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఘాట్ రోడ్డులో చరియలు విరిగిపడ్డాయి. టీటీడీ సిబ్బంది కొండ చరియలు తొలగించారు. ఘాట్ రోడ్డులో భక్తులు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని టీటీడీ సూచించింది. తిరుమలలో మంచు దృశ్యాలు ఎంతో సుందరంగా ఉన్నాయి. తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉంది. తిరుమల కొండపై భారీగా మంచు కురుస్తోంది.
రోడ్లపై భారీ చెట్లు
ఫెంగల్ తుపాను తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ఏపీలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానికులు, శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆదివారం నాడు కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ మార్గంలో కొంత సమయం వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే టీటీడీ సిబ్బంది అప్రమత్తమై ఎప్పటికప్పుడు జేసీబీలతో రోడ్ల మీదకు వచ్చిన బండరాళ్లను తొలగించి రోడ్డు మార్గాన్ని క్లియర్ చేస్తున్నారు.ఫెంగల్ తుపాను ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖపట్నం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో వర్షాల కారణంగా విశాఖపట్నం- తిరుపతి విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. భారీ వర్షాలతో చెన్నై ఎయిర్ పోర్టును సైతం తాత్కాలికంగా మూసివేశారు. దాంతో విశాఖపట్నం- చెన్నై విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్, విమనాశ్రయ అధికారులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular