- Advertisement -
మహిళా కానిస్టేబుల్ను నరికి చంపిన తమ్ముడు
Woman constable killed by his brotherరంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణిని సొంత సోదరుడు పరమేశ్ దారుణంగా హత్య చేశాడు. ఇటీవల ఆమె ప్రేమించి, కులాంతర వివాహం చేసుకోవడంతో కుటుంబీకులు ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలోనే సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లొస్తున్న నాగమణిని రాయపోలు-మన్నెగూడ మార్గంలో పరమేశ్ కారుతో ఢీకొట్టాడు. అనంతరం ఆమెను కత్తితో నరికి చంపాడు. తరువాత పోలీసులముందు లొంగిపోయాడు.
- Advertisement -




