రహస్య కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

- Advertisement -

రహస్య కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

Task force police raid on clandestine cockfighting base

 ఏడుగురు పందెం రాయుళ్ల అరెస్ట్..
పరారిలో మరికొంత మంది

13 పందెం కోళ్లు, 60 కత్తులు, 05 మొబైల్స్, రూ. 6530 నగదు స్వాధీనం

పెద్దపల్లి ప్రతినిధి:  పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాపుల పల్లి గ్రామ శివారులో  రహస్యంగా డబ్బులు పందెంగా పెట్టి కొంత మంది పందెం కోళ్లతో పందెం రాయుళ్లు ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రాజేష్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు.  కోడిపందాలు ఆడుతున్న ఏడుగురు నిందితులను పట్టుకోని వారి వద్ద నుండి 13 కోళ్లు, 60 కత్తులు, 05 మొబైల్స్, రూ. 6530 నగదు స్వాధీనంచేసుkuన్నామని తెలిపారు. పట్టుబడిన నిందితులను పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించగా, మరి కొంతమంది పరారీలో  ఉన్నారన్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడిన వారిలో రాగినేడు గ్రామానికి చెందిన తాళ్ల రాములు, యాదగిరి అనిల్, కొత్తపళ్లి గ్రామానికి చెందిన  వెంకటేష్, బ్రాహ్మణపల్లి కి చెందిన మూల మహేందర్, పెద్దపల్లి పట్టణం తెలుగు వాడకు చెందిన బుతగడ్డ నర్సయ్య, పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన రావుల మధునయ్య, సుల్తానాబాద్ మండల కేంద్రానికి చెందిన మైదాంపల్లి రవితేజ లు ఉన్నారని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular