అభివృద్ధి పేర విధ్వంసం సృష్టిస్తూ చిరువ్యాపారుల జీవితాలను రోడ్డుపై పడేశారు.
In the name of development, the lives of small traders have been thrown on road= చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకుండా దుకణాలు కుల్చారు.
= వ్యాపారులకు న్యాయం జరిగేదాకా పోరాటం.
= నేటి బజార్ బందు జయప్రదం చేయండి.
= రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్.
గోదావరిఖని
:
రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని, ఎన్టీపిసి లో పాలకుల అభివృద్ధి పేరిట విద్వసం సృష్టిస్తూ వ్యాపారులను, చిరువ్యాపారులను ఆర్థిక నష్టానికి గురిచేస్తున్నారు… చిరు వ్యాపారులకు ఎటువంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా వారి వ్యాపార సంస్థలను కూల్చివేయడం వలన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి
చిరువ్యాపారులకు న్యాయం జరిగేంతా వరకు పోరాడుతని మంగళవారం బజరుబంద్ కు వ్యాపారులు ప్రజలు పాల్గొని జయపద్రం చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ కోరారు. లక్ష్మినగర్, కళ్యాన్ నగర్, గణేష్ నగర్ ప్రాంతాల్లో రోడ్ల వెడల్పు పేర్ల మీద ఇండ్లు, షాపులను కూల్చి వేయడం వలన వ్యాపారస్తులు ఆర్థిక సంక్షోబానికి గురి అవుతున్నారని తెలిపారు. కళ్యాన్ నగర్ ప్రాంతంలో రోడ్లు తవ్వి వదిలేయడం వలన వ్యాపారాలు సాగాక ఆర్థిక నష్టానికి లోనవుతున్నారన్నారు. ఎన్టీపిసి గాంధీ మార్కెట్ చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించడంతో వారు ఆకలితో అలమటిస్తు దిక్కు తోచని స్తితిలో ఉన్నారని వారికి ప్రత్యాంన్యాయం చూపించి వారిని ఆదుకోవాలన్నారు. రోజురోజుకు జనాభ తగ్గుతున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వ్యాపారాలు నడవక ఇబ్బంది పడుతున్న స్తితిలో సుందరీకరణ పేరిట, రోడ్డు విస్తరణ పేరిట, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరిట ప్రశాంతంగా ఉన్న వ్యాపార ప్రాంతాల్లో కల్లోలం రేపుతున్న కూల్చివేతలకు నిరసనగా వ్యాపారులు, చిరువ్యాపారులు, కార్మిక కర్షక సకలజనులు ఐక్యం అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ నేపథ్యంలో కూల్చివేతలను నిలిపి వేయాలని చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తరువాతే వారి షాపులను తొలగించాలని అన్నారు. రోడ్డు వెడల్పుతో లక్ష్మీనగర్లో నిర్మాణాల కూల్చివేతలకు గురి అయ్యే ఇండ్లకు వ్యాపార సంస్థలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 03 వ తేది మంగళవారం గోదావరిఖని, ఎన్టీపిసిలో జరిగే బజార్ బంద్ వ్యాపారులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.




