కృత్రిమ మేథలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించుకోవాలి
Students should acquire proficiency in artificial intelligence-ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి
మంథని
కృత్రిమ మేథలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు.
బాచుపల్లిలో నిర్మించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ను సోమవాంర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
100 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాటైన ఈ యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటి దాకా రూ.35 కోట్లు వ్యయం చేసారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం 39 వ వ్యవస్థాప దినోత్సవాలను కూడా మంత్రి ప్రారంభించారు.
అనంతరం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు కంప్యూటర్ల వినియోగంలో ప్రావీణ్యం కోసం 100 కంప్యూటర్లను కేటాయించనున్నట్టు శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసుకునేలోగా వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం పైనే సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోంది. మన సంస్కృతి, సంప్రదాయాల వారసత్వాన్ని భావితరాలకు అందించే లక్ష్యంతోనే తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు అయిందన్నారు. పద్మభూషణ్ వరప్రసాద రెడ్డికి విశిష్ట పురస్కారం అందించిన మంత్రి శ్రీధర్ బాబు. పురస్కారంతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి అందజేశారు.
విశ్వవిద్యాలయ అభివృద్ధికి కోటి రూపాయల విరాళం వరప్రసాద రెడ్డి అందించారు.
విశ్వవిద్యాలయం విద్యార్థుల చిత్ర లేఖనం ప్రతిభను అమెరికా, మలేషియా దేశాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో చూసామన్నారు.
ఇప్పటి దాక విశ్వవిద్యాలయ కీర్తిని చాటుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చిన మహనీయులకు ధన్యవాదాలు తెలిపారు.ఉప కులపతి నిత్యానందరావు నేతృత్వంలో ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.




