ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 వినతులు.

- Advertisement -

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 వినతులు.

25 petitions to the platform for solving public problems.

కమిషనర్ ఎన్.మౌర్య.
తిరుపతి,
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 25 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 25 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన టీడ్కో ఇండ్ల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ నందు స్తాల్స్ ఏర్పాటు చేయడంతో పిల్లలు ఆదుకునేందుకు ఇబ్బందిగా ఉందని, ఇకపై స్టాల్స్ కు అనుమతి ఇవ్వొద్దని, టి.డి.ఆర్. బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కోసం నగదు కట్టామని, ఇండ్లు ఇవ్వలేదని డబ్బులు తిరిగి ఇవ్వాలని, శ్రీవారి నగర్ లో విద్యుత్ దీపాలు వెలగలేదని, కాలువలు, రోడ్లు శుభ్రం చేయాలని,  కుమ్మరులు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు నామమాత్రపు ధరలకు గదులు కేటాయించాలని, తుడా పరిధిలో ఎం.ఐ.జి. ప్లాట్ కొన్నామని ఇప్పుడు స్థలం తక్కువగా ఉంది న్యాయం చేయాలని, కే.టి.రోడ్డు లో ఫాస్ట్ ఫుడ్ నందు వచ్చే వ్యర్థాలు మురుగునీటి కాలువలో వదులుతున్నారని, ప్రకాశం పార్కు నందు జిమ్ పరికరాలు మరమ్మత్తులు చేయాలని, నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉండాలని పరిష్కరించాలని కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, రవి, సెక్రటరీ రాధిక, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, మేనేజర్ హాసిమ్, డి.ఈ.లు, ఏ.సి.పి.లు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular