ప్రపంచంలోనే అద్భుతం భారత రాజ్యాంగం
The wonder of the world is the Constitution of Indiaదేశ ప్రజలకు దిక్సూచి భారత రాజ్యాంగం.
మహాత్మ జ్యోతిరావు పూలే,బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పరికిపండ్ల నరహరి
మగుండం :
ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతమని సీనియర్ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి అన్నారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్, ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు, పరికిపండ్ల నరహరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ సంఘం నాయకులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు, అనంతరం, పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పరికిపండ్ల నరహరి మాట్లాడారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైన మహాత్మా జ్యోతిరావు పూలే, పేరిట బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించడం గొప్ప విషయమని అన్నారు, పూలే అంబేద్కర్ చేసిన సేవలను ప్రజలకు తెలిపి చైతన్యవంతులను చేయాలన్న సదుద్దేశంతో ఆలిండియా అంబేద్కర్ సంఘం చేపట్టిన పూలే అంబేద్కర్ జ్ఞాన మాల కార్యక్రమాన్ని పరికిపండ్ల నరహరి అభినందించారు, చాలా గొప్ప కార్యక్రమాన్ని ప్రతి వారం వారం ఈ కార్యక్రమం చేపట్టడం వల్ల అనగారిన వర్గాలను చేతనవంతం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలను అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు , అంబేద్కర్ పులేని ఆదర్శంగా తీసుకొని అన్ని వర్గాల ప్రజలు ప్రజలను చైతన్యవంతం చేయడమే భారత రాజ్యాంగానికి ఇచ్చిన గొప్ప గౌరవం అన్నారు, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అద్భుతమన్నారు, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్. వరుణ్ కుమార్, మాట్లాడారు, ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలని దేశంతో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని తెలుగులో అనువదించడం జరిగిందని దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు అందరూ సహకరించాలన్నారు,
ఒక లక్ష, పూలే, అంబేద్కర్ పుస్తకాలను పంపిణీకి కృషి చేస్తా
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి
భారత రాజ్యాంగం రాసిన బాబా సాహెబ్ అంబేద్కర్ తన గురువైన మహాత్మ జ్యోతిరావు పూలే పేరిట లక్ష పుస్తకాలు ప్రింట్ చేయించేందుకు అన్ని విధాల సహకరిస్తానని మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ పరికిపండ్ల నరహరి హామీ ఇచ్చారు, అందుకు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, ఆలయ ఫౌండేషన్ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు, లక్ష పుస్తకాలు పంపిణీకి కృషి చేస్తున్నట్టు ప్రకటించిన ఐఏఎస్ ఆఫీసర్ నరహరి కి ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం కృతజ్ఞతలు తెలిపింది, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్టు, బొంకూరి మధు, ఆలిండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ ల అధ్యక్షతన జరిగిన వివిధ కార్యక్రమాలలో, సింగరేణి ఆర్జీవన్, అడిషనల్ మెడికల్ ఆఫీసర్, కిరణ్ రాజ్ కుమార్, గోదావరిఖని వన్ టౌన్ సిఐ, ఏ ఇంద్రసేనారెడ్డి, బిజెపి రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి, కందుల సంధ్యారాణి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇరుగురాల కృష్ణయ్య సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్ కార్పొరేటర్ ఐత శివ,, ఆలయ ఫౌండేషన్ సీఈవో, తీట్ల రమేష్ బాబు, డిప్యూటీ సీఈవో, మిట్టపల్లి రాజేంద్రప్రసాద్, సభ్యులు ఆర్నకొండ వెంకటేశ్వర్లు, కన్నం తిరుపతి, మల్కా రామస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు, బూడిద మహేందర్, గొర్రె నర్సింగరావు, ఆకునూరు బాలంకుస్, ఇంటి బిల్లి రవీంద్ర కుమార్, ఉప్పులేటి పవన్ కుమార్, కనకం రమణయ్య, కాష్పాక రాజమౌళి, బొట్ల స్వామి, ఎండి నవాబ్, తదితరులు పాల్గొన్నారు




