ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి
Prajavani applications should be dealt with expeditiouslyకలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ రెవెన్యూ, ప్రపుల్ దేశాయ్ స్థానిక సంస్థలు, నగర పాలిక కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణికి మొత్తం 259 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ప్రధానంగా భూ సమస్యల పరిష్కారానికి అధికంగా వచ్చాయి.
అత్యధికంగా కరీంనగర్ నగరపాలికకు 24 దరఖాస్తులు, కరీంనగర్ ఆర్డిఓ కార్యాలయానికి 22, హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయానికి 15, కరీంనగర్ రూరల్ తహేసీల్దార్ కార్యాలయానికి 17, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి 15 దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ. సీఎం ప్రజా దర్బార్ లాగిన్ లో ఉన్న అన్ని అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు.
ఇప్పటివరకు వచ్చిన పిటిషన్లు, పరిష్కరించిన వాటి వివరాల కాపీలను బుధవారం కార్యాలయానికి తీసుకురావాలని అన్ని మండలాల డిప్యూటీ తహసీల్దార్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇబ్బంది పాల్గొన్నారు




