బద్వేల్ మాజీ యం.యల్. ఏ  విజయమ్మను మర్యాద పూర్వకంగా కలిసిన హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజారత్నం

- Advertisement -

బద్వేల్ మాజీ యం.యల్. ఏ  విజయమ్మను మర్యాద పూర్వకంగా కలిసిన హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజారత్నం

Badwel is former Y.Yal.Rajaratnam, director of housing project who met Vijayamma

బద్వేలు

వైఎస్ఆర్ జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ రాజారత్నం బద్వేల్ మాజీ యం.యల్. ఏ  విజయమ్మను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి పి ఎమ్ ఏ వై 2.0 గురించి వివరించారు. ఈ సందర్భంగా విజయమ్మ

మాట్లాడుతూ నియోజకవర్గం లోని చాలా గ్రామాలలో 2014 నుండి బిల్లులు పెండింగ్ ఉన్నాయని వాటిని కూడా మంజూరు చేయించాలని పి ఎం ఏ వై 1.0 కింద మంజూరు అయిన ఇల్లు త్వరగా పూర్తి అయ్యేలా

చూడటం తో పాటు నియోజక వర్గం లో పీఎం ఏ వై 2.0 కింద అర్హులందరికీ ఇల్లు మంజూరు చేయాలని అదే విధంగా అన్నీ లేఔట్ లలో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని   కోరారు.
పాత బిల్లులు, పి ఎం ఏ

వై 1.0  లోని ఇల్లు త్వరగా పూర్తి చేయించి పీఎం ఏవై 2.0 కింద అర్హులందరికీ ఇల్లు మంజూరు అయ్యేలా చూస్తామని ప్రాజెక్టు డైరెక్టర్ అన్నారు.
అనంతరం పురపాలక కార్యాలయం నందు మునిసిపల్ కమీషనర్,

హౌసింగ్ , మెప్మా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అలాగే పీఎంఏవై 1.0 కింద మంజూరు అయిన ఇల్లు కూడా  సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు.సకాలంలో ఇంటి నిర్మాణాలు పూర్తి కాకపోతే బిల్ లు

రాకపోవడంతో పాటు తరువాత ఇల్లు కూడా మంజూరు కావన్నారు.లబ్ధిదారులు  డిసెంబర్ చివరి నాటికి వీలైనంత తొందరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు ఇసుక,సిమెంట్,కడ్డీలు మరియు ఇతర మౌలిక

సదుపాయాలు కల్పిస్తామన్నారు* అంతే గాకుండా ఆర్థికంగా వెనుకబడిన వారికి యస్ హెచ్.జి ద్వారా లోన్ 35000/- ఇవ్వడం జరిగిందన్నారు.అవసరం ఐతే అదనంగా కూడా లోన్ మంజూరు చేయడం

జరుగుతుందన్నారు* .
కాంట్రాక్టర్ లు కూడా డిసెంబర్ చివరి నాటికి ఇల్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షా కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ తో పాటు మునిసిపల్ కమీషనర్ వి.వి.నరసింహరెడ్డి,కాంట్రాక్టర్

లు,హౌసింగ్ సిబ్బంది, మెప్మ సిబ్బంది  తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular