- Advertisement -
జర్నలిజం కోర్సు విద్యార్థులు క్షేత్ర పర్యటన
Journalism course students field tripజగిత్యాల,డిసెంబర్ 03
జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిజం సర్టిఫికేట్ కోర్సు చదువుతున్న విద్యార్థినులు
క్షేత్ర పర్యటనలో భాగంగా
మంగళవారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసు శాఖ పనితీరు విధానాలు, నిబంధనలను తెలుసుకున్నారు. జర్నలిజం కోర్సు ఇన్‌చార్జి ఖాన్ జియా ఆధ్వర్యంలో ఉర్దూ-తెలుగు, ఆంగ్ల మాధ్యమానికి చెందిన 25 మంది విద్యార్థులు క్షేత్ర పర్యటనలో పాల్గొన్నారు. బృందంతో పాటు పొలిటికల్ సైన్స్ లెక్చరర్ యాస్మిన్ సుల్తానా, ఇంగ్లీష్ లెక్చరర్ సునీత ఉన్నారు.ఈ సందర్భంగా జర్నలిజం విద్యార్థులతో రూరల్ ఎస్‌హెచ్‌వో జగిత్యాల సుధాకర్ మాట్లాడుతూ మండలం జగిత్యాల చుట్టుపక్కల 32 గ్రామాలు పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. భూ తగాదాలు, కుటుంబ తగాదాలతోనే ఎక్కువ మంది పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ఇప్పుడు చాలా సులువుగా మారిందని, ఈ సందర్భంగా లేడీ హెడ్ కానిస్టేబుల్ పి.కుమారి షీ-టీమ్‌లు, సైబర్ క్రైమ్‌లు తదితర అంశాలపై సమాచారాన్ని అందజేస్తూ ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎలాంటి ఆపద వచ్చిన సహాయం కోసం
పోలీసు నంబర్ 100 డయల్ చేసి ఉపయోగించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ పీ శంకర్, క్రైమ్ రైటర్ సైఫుల్లా, ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




